22-12-2025 02:50:25 AM
మొయినాబాద్, డిసెంబర్ 21(విజయ క్రాంతి): పూర్వ విద్యార్థులు కలుసుకోవడం అభినందనీయమని, ఇలాంటి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రావడం అదృష్టంగా భావిస్తున్నానని జెబిఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ జెయింట్ సెక్రెటరీ ప్రొఫెసర్ జై గాయత్రి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని జేబిఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ కళాశాలలో గతంలో చదివిన పూర్వ విద్యార్థులు ఆనాటి విద్యార్థుల సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. సమ్మేళనంలో వివిధ ప్రాంతాల్లో ప్రతిష్టాత్మక సంస్థల్లో సేవలు అందిస్తున్న వివిధ బ్యాచ్లకు చెందిన పూర్వ విద్యార్థులు ఉద్యోగులు ఒకచోట కలుసుకొని ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.
ఈ సందర్భంగా కళాశాల కార్యదర్శి జై గాయత్రి మాట్లాడుతూ జగన్ పల్లి భాస్కరరావు ఇంజనీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో కళాశాల ప్రాంగణంలో సమ్మేళనాన్ని నిర్వహించడం విద్యార్థులను అభినందించారు. ఆమె మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు పాత్ర ఎంతో కీలకమని అన్నారు. తమ విద్యాసంస్థలో అభ్యసించి వివిధ రంగాలు, వ్యాపారాలు స్థిరపడి, ఉద్యోగాలు చేస్తూ కుటుంబ పోషణలో ఉండటం సంతోషంగా ఉన్నందుకు ఆమె అభినందించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ వృత్తిపరమైన అనుభవాలను పంచుకొంటూ ప్రస్తుత విద్యార్థులు ఆవిష్కరణ నైపుణ్య అభివృద్ధి నైతిక విలువల పై దృష్టి సారిస్తే జీవితంలో విజయాలను సాధించవచ్చునని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ టీవీఎస్ అరుణ్ మూర్తి డిం శ్రీమతి ప్రత్యుష తదితరులు పాల్గొన్నారు.