calender_icon.png 22 December, 2025 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాల అభివృద్ధికి కృషి చేయండి

22-12-2025 02:50:46 AM

నూతన సర్పంచ్‌ల సన్మాన కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

కోదాడ, డిసెంబర్ 21 (విజయక్రాంతి): నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్‌రెడ్డి పేర్కొ న్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కోదాడలోని డేగ బాబు ఫంక్షన్ హాల్‌లో నూత నంగా గెలుపొందిన నియోజకవర్గ సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు మెంబర్లకు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో మంత్రి పా ల్గొని మాట్లాడారు. గ్రామపాలనలో బా ధ్యతాయుతంగా వ్యవహరిస్తూ శాంతి భద్రతలను కాపాడుతూ గ్రామ అభివృద్ధికి కట్టు బడి పనిచేయాలని సూచించారు.

ముందు గా గెలిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అభినందనలు తెలిపిన ఉత్తమ్, గ్రామంలో సర్ప ంచ్ మొదటి పౌరుడని గుర్తుచేశారు. అహంకారానికి తావివ్వకుండా ప్రజలతో కలిసి మెలసి పనిచేస్తూ గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని సూచించారు. నూతనంగా గెలిచిన సర్పంచ్‌లు ఒక్కో గ్రామానికి 30 ఇండ్లు మంజూరు చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని ప్రకటించారు.

ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి ఆధ్వర్యంలో కోదాడ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలిపా రు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మావతి , ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య, గ్రంథాల య సంస్థ జిల్లా చైర్మన్ వంగవీటి రామారావు, పీసీసీ డెలిగేట్ లక్ష్మీనారాయణరెడ్డి, కేఎల్‌ఎన్ ప్రసాద్ పాల్గొన్నారు.