calender_icon.png 22 December, 2025 | 4:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేరు మార్పునకు నిరసనగా ఆందోళన

22-12-2025 02:49:06 AM

మేడ్చల్, డిసెంబర్ 21(విజయ క్రాంతి): మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మేడ్చల్ లో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపుమేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహాత్మా గాంధీ ప్ల కార్డులు ప్రదర్శించారు. మహాత్మా గాంధీ పేరు తొలగించడం అప్రజాస్వామికమని వారు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వజ్రెష్ యాదవ్, కుతుబుల్లాపూర్, ఉప్పల్ నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జీలు కొలను హనుమంత రెడ్డి, మందమల్ల పరమేశ్వర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి పీసరి మహిపాల్ రెడ్డి, భూపతి రెడ్డి, జిల్లా గ్రంథాలయ, మార్కెట్ కమిటీ చైర్మన్ లు బొంగునూరు శ్రీనివాసరెడ్డి, బొమ్మలపల్లి నరసింహ యాదవ్, జైపాల్ రెడ్డి, మేడ్చల్ పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వేముల శ్రీనివాసరెడ్డి, మాజీ కౌన్సిలర్ కౌడే మహేష్, గుండ్ల పోచంపల్లి మున్సిపల్ అధ్యక్షుడు సాయిపేట శ్రీనివాస్, గుండ్ల పోచంపల్లి మాజీ సర్పంచ్ బేరి ఈశ్వర్, గుండ్ల పోచంపల్లి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దామన్న గారి ప్రభాకర్, మాజీ కౌన్సిలర్ మారేపల్లి సుజాత సుధాకర్, మహిళా కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీ, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు రవి ముదిరాజ్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పత్తి కుమార్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు గణేష్, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు షఫీ ఉద్దీన్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బొమ్మక అజయ్ పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు.