calender_icon.png 22 September, 2025 | 5:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత్తు పదార్థాలు రవాణా చేస్తూ ఇద్దరు అరెస్ట్

22-09-2025 12:19:53 AM

నాగర్కర్నూల్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి) : బిజినేపల్లిగోపాల్పేట్ రోడ్డులో అల్లిపూర్ వద్ద తనిఖీలో భాగంగా ద్విచక్రవాహనంలో రూ.60వేల విలువ జేసే అల్ప్రా జొలం పొడి 97 గ్రాములు స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఉమ్మడి పాల మూరు జిల్లా ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ విజయభాస్కర్ రెడ్డి తెలిపారు.

అక్ర మంగా తరలిస్తున్న  అల్లిపూర్ గ్రామానికి చెందిన సాంబ మహేష్, వనపర్తి జిల్లా బొ ల్లారం గ్రామానికి చెందిన మాదాస్ వెంకటయ్యగౌడ్ లను అరెస్టు చేశారు. వారితో పాటు ద్విచక్ర వాహనం, రెండు మొబైల్స్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి ద ర్యాప్తు కొనసాగిస్తున్నట్టు తెలిపారు. ఈ దాడిలో ఆప్కారి శాఖ అధికారి గాయత్రి,  టాస్క్ ఫోర్స్ సీఐ ఆర్ వి.రాజ్యాలక్మి, ఎక్సైజ్ సీఐ కళ్యాణ్ సిబ్బంది  చిన్ననాయక్, రూఖ్య నాయక్ , రవీందర్ గౌడ్‌పాల్గొన్నారు.