calender_icon.png 20 November, 2025 | 2:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్యాస్ రీఫిల్లింగ్ దందాపై పోలీసులు, సివిల్‌సప్లై అధికారుల దాడులు

20-11-2025 12:00:00 AM

 మేడ్చల్ అర్బన్, నవంబర్ 19 (విజయ క్రాంతి): మేడ్చల్‌లో రీ ఫిల్లింగ్ దందాపై సివిల్ సప్లై అధికారులతో పాటు  పోలీసుల దాడులు నిర్వహించారు. పట్టణంలోని గోకుల్ నగర్ శివాలయం సమీపంలో  మన్మధరావు  ఇంటిపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నిల్వ ఉంచిన సిలిం డర్లతో పాటు సిలిండర్లను రి ఫీలింగ్ చేసే సామాగ్రి  ఉన్నట్లు గుర్తించారు. మన్మధ రావు తో పాటుమార్కెట్లో రీ ఫిల్లింగ్ చేస్తున్న ఇమ్రాన్ ను అరెస్టు చేశారు. ఈయన పెద్ద మొత్తంలో ఈ దందా చేస్తున్నాడు. ఈ దాడుల్లో వివిధ కంపెనీలకు చెందిన 94 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.