22-11-2025 09:38:14 PM
చిట్యాల (విజయక్రాంతి): నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని వెలిమినేడు గ్రామానికి చెందిన సిపిఎం కార్యకర్త గుంటోజు వీరయ్య ఇటీవల మృతిచెందడంతో ఆయన కుటుంబ సభ్యులకు శనివారం సిపిఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో 16 వేల రూపాయలు పార్టీ సీనియర్ నాయకుడు బొంతల చంద్రారెడ్డి చేతులమీదుగా ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు నెలికంటి నరసింహ, పంది నరేష్, నాతి వెంకట్రామయ్య, సురగంటి మోహన్ రెడ్డి, ఆడెపు రమేష్, దేశ బోయిన లింగస్వామి, అరూరి శంభయ్య, దేశబోయిన నరసింహ, మామిడి రాములు, నాతి కిరణ్, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.