calender_icon.png 22 November, 2025 | 9:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామానికి సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న యువ నాయకులు షాపురం రాజు

22-11-2025 09:10:13 PM

* రెడ్డిపల్లి గ్రామంలో వెలిగిన వీధి దీపాలు

* సొంత నిధులతో అమర్చిన రెడ్డిపల్లి గ్రామ యువ నాయకులు షాపురం రాజు

మొయినాబాద్,(విజయక్రాంతి): రెడ్డిపల్లి గ్రామ పరిధి ప్రారంభం నుంచి వీరన్నపేట్, చిన్నమంగళరం శివారు వరకు వెలుగునున్న వీధి దీపాలు మొయినాబాద్ మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన యువ నాయకులు షాపురం రాజు (మాణిక్యం) గ్రామానికి సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. రెడ్డిపల్లి గ్రామ పరిధి ప్రారంభం నుంచి శివారు వరకు గ్రామంలోని ప్రతి వీధిలో లైట్లు సరిగా పనిచేయకపోవడంతో రహదారిపై ప్రయాణికులు గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గ్రామపంచాయతీ పాలకవర్గం లేకపోవడం నిధుల కొరతతో అధికారులు స్పందించకపోవడంతో ఈ సమస్యను గమనించిన రెడ్డిపల్లి గ్రామ యువ నాయకులు షాపూరం రాజు (మాణిక్యం) గ్రామ ప్రజల ఆకాంక్ష మేరకు శనివారం షాపురం రాజు గ్రామస్తులతో కలిసి గ్రామంలోని అన్ని వీధిలలో తన సొంత డబ్బులతో సోలార్, విద్యుత్ వీధి దీపాలను అమర్చారు.

ఈ సందర్భంగా షాపూరం రాజు మాట్లాడుతూ.. గ్రామ పరిధి ప్రారంభం నుంచి శివారు వరకు వీధి దీపాలు లేకపోవడంతో ప్రయాణికులు అనేక ప్రమాదాలకు గురవుతున్నారని, గ్రామంలోని ప్రతి వీధిలలో లైట్లు లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తన సొంత డబ్బులతో గ్రామంలోని వీధిలతో పాటు అన్ని దేవాలయాల వద్ద సోలార్ విద్యుత్ వీధి దీపాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు.గ్రామానికి ఎంత చేసిన తక్కువేనని గ్రామానికి సేవ చేసే అదృష్టం దక్కడంతో ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు పాల్గొని షాపూరం రాజును అభినందించారు.