06-12-2025 12:00:00 AM
* బీజేపీ జాతీయ నాయకుడు మురళీధర్
* దత్తగిరి ఆశ్రమంలో ఘనంగా లక్ష దీపోత్సవం
జహీరాబాద్, డిసెంబర్ 5 : ప్రపంచ మానవాళికి జ్ఞాన జ్యోతిని అందించిన దేశం భారతదేశమని భాజపా జాతీయ నాయకుడు మురళీధర్ రావు అన్నారు. గురువా రం రాత్రి బర్దిపూర్ లోని శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో లక్ష దీపోత్సవ కార్యక్రమా నికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పా టు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారతదేశానికి గల ప్రాముఖ్యత ఇత ర దేశాలకు లేదని, అందుకే భారత భూమి కర్మభూమి అని గుర్తు చేశారు.
ప్రపంచ మానవాళికి జ్ఞానాన్ని అందించేందుకు ఈ దేశంలో ఎంతోమంది సాధు సత్పురుషులు తమ తపస్సు వల్ల జ్ఞానాన్ని అందించారని తెలిపారు. బర్దిపూర్ ఆశ్రమంలో దస్తగిరి మహారాజ్ తపస్సు చేత ఆశ్రమాన్ని అభివృద్ధి చేశారని ఆయన తపోబలం వల్లే నేడు ఆశ్రమంలో లక్ష దీపోత్సవ కార్యక్రమం ప్రపంచానికే ఓ దీప స్తంభంగా నిలుస్తుందని పేర్కొన్నారు. మన దేశ సనాతన ధర్మాన్ని పాటిస్తారని, ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుందని తెలిపారు.
యోగి దిగంబర సినిమా నిర్మించడానికి ప్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి చంద్రశేఖర్, బిజెపి జిల్లా అధ్యక్షురాలు గోదావరి, గొల్ల భాస్కర్, ఆశ్రమ పీఠాధిపతి అవధూత గిరి మహారాజ్, మహా మండలేశ్వర్ సిద్దేశ్వర నందగిరి మహారాజ్, ధనసిరి ఆశ్రమ పీఠాధిపతి శివాచార్య స్వామీజీ, న్యాల్కల్, ముంగి, తలోకి ఆశ్రమాల పీఠాధిపతులు పాల్గొన్నారు. కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లాలోని శ్రీ దత్తగిరి పాఠశాల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమాలను తిలకించేం దుకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు.