06-12-2025 12:00:00 AM
తాసిల్దార్‌కు వినతిపత్రం అందిస్తున్న దళిత కుటుంబాలు
మొయినాబాద్, డిసెంబర్ 5 (విజయ క్రాంతి) దళిత కుటుంబాలకు న్యాయం చేయాలని పలువురు దళితులు తాసిల్దార్ గౌతమ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద మంగళారం గ్రామం రెవెన్యూ లోని సర్వేనెంబర్ 218 లో గత 57 ఏళ్ల క్రితం కోళ్ల ఫారాలు నిర్మాణం కోసం దళితులకు ఆరు ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది. ప్రస్తుతం అట్టి భూమిని హెచ్‌ఎండిఏ అధికారులు తీసుకోవడానికి ప్రయత్నం చేయడంతో అధికారుల తీరు నిరసిస్తూ తొమ్మిది రోజులుగా ఆందోళన చేపట్టారు.
అందులో భాగంగా శుక్రవారం తాసిల్దార్ గౌతం కుమార్ కు వినతి పత్రం అందించారు. 50 ఏళ్ల క్రితం ఇచ్చిన భూమిపై హెచ్‌ఎండి అధికారులు లాక్కోవడనికి ప్రయత్నిస్తున్నారని అది వెంటనే ఆపేయాలని కోరారు. గతంలో 36 మంది దళిత కుటుంబాలకు ఆరు ఎకరాలు కేటాయించారని చెప్పారు. దళితులకు ఆ భూమి తప్ప ఎలాంటి ఆధారం లేదని దళిత కుటుంబాల కేటాయిస్తే వారికి న్యాయం చేసిన వారు అవుతారని కోరరు.
కొన్ని కారణాల చేత కూలపాలంలో తొలగించబడ్డాయని ఆనాటి నుంచి దళిత కుటుంబాలు ఉపాధి కోల్పోయాయని అట్టి భూమిని కాపాడుకుంటూ ఆ భూమిని నమ్ముకుంటూ జీవిస్తున్నామని తెలిపారు. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. తాసిల్దార్ గౌతమ్ కుమార్ ఇట్టి విషయంపై రిపోర్టు రాసి జిల్లా కలెక్టర్కు అందిస్తామని హామీ ఇచ్చారు. ఏఎంసీ మాజీ చైర్మన్ డప్పు రాజు, నాయకులు సంజీవరావు, సురేష్, యాదయ్య, కుమార్, గంగయ్య, జంగం రాజు, నాగరాజు, కిష్టయ్య, నగేష్ పాల్గొన్నారు.
తమకు న్యాయం చేయాలని సెల్ టవర్ ఎక్కిన యువకుడు
దళిత కుటుంబాలకు సంబంధించి భూములు తీసుకోవద్దని పెద్ద మంగళారం గ్రామానికి చెందిన ఓ దళిత యువకుడు మున్సిపాలిటీ కేంద్రంలో సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. పెద్ద మంగళారం గ్రామానికి చెందిన ముడుమేల రాములనే యువకుడు టవర్ ఎక్కాడు. మా బాధలు చేవెళ్ల ఎమ్మెల్యే పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ సెల్ టవర్ ఎక్కి మున్సిపల్ కేంద్రంలో కొంతసేపు టెన్షన్ వాతావరణం స్పృష్టించాడు.
తీవ్ర మనస్థాపానికి గురై సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు అతన్ని ప్రయత్నాన్ని భంగం చేశారు సమాచారం అందుకున్న సిఐ పవన్ కుమార్ రెడ్డి తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని కిందకి దిగాలని ఎంత చెప్పిన దిగకపోవడంతో పోలీసులు సెల్ టవర్ ఎక్కి అతని కిందికి దింపి అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.