06-10-2025 01:21:35 AM
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
కామారెడ్డి, అక్టోబర్ 05,(విజయక్రాంతి) ప్రకృతి విపత్తు పై టిఆర్‌ఎస్ నేత హరీష్ రావు రాజకీయం చేయడం సిగ్గుచేటు అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లాలో హరీష్‌రావు పర్యటించి మాట్లాడిన మాట లకు దీటుగా షబ్బీర్ ఆలీ స్పందించారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్న పది సంవత్స రాల్లో వర్షాలు వడగళ్ల వాన వల్ల ఎన్నో సార్లు పంట నష్టం జరిగినా ఏ ఒక్కసారి కూడా రైతులను ఆదుకోలేనివారు.
మాట్లా డడం ఏమిటి అని ప్రశ్నించారు. హరీష్ రావు ఇక్కడి ప్రజలపై ప్రేమతో రాలేదు. స్థానిక ఎన్నికల్లో పరువు కాపాడుకోవడానికి హరీష్‌రావు పర్యటన అని ప్రభుత్వ సలహా దారు మహమ్మద్ అలీ షబ్బీర్ అలీ అన్నా రు. హరీష్ రావు పర్యటన పై మాట్లాడుతూ కుటుంబ సమస్యలు నుండి తేరుకొని బాధితులను పరామర్శించ డానికి నెల రోజులు పట్టింది అని ఎద్దేవా చేశారు. ,ప్రజల నివాసాలు నీళ్లతో కొట్టుకు పోయి హహకారాలు చేస్తుంటే బిఆర్‌ఎస్ నాయకులు కార్యకర్తలు ఎటుపోయారు అని ప్రశ్నించారు.
వర్షాల్లో ప్రమాదమని తెలిసి కూడా ముఖ్యమంత్రి హెలిపాడ్‌లో ముంపు ప్రాంతాలు చూడడానికి వచ్చారు. వాతావరణం అనుకూలించక ప్రజలను పరామర్శించలేకపోయారు. తిరిగి రెండు రోజుల్లో వచ్చి నష్టపోయిన రైతులతో మాట్లాడి వారిని పరామర్శించి వారి కుటుంబాలకు తక్షణ సహాయం కింద 11 వేల రూపాయల చొప్పున చనిపోయిన వారి కుటుంబాలకు నాలుగు లక్షలు అందించారన్నారు.
నాలుగు గంటలలో రోడ్లను మరమ్మతు చేసి రాకపోకలను పునరుద్ధరించారనీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రివ్యూ నిర్వహించి అధికారులను సర్వే చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగా నే 65 వేల ఉద్యోగాలు ఇచ్చామని, పదేళ్లలో బిఆర్‌ఎస్ పార్టీ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రేషన్ కార్డు లేని ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందిస్తున్నాం.
హౌసింగ్ కార్పొరేషన్ ఎత్తివేసి డబుల్ బెడ్ రూమ్ ఇస్తామని పదేళ్లలో నియోజకవ ర్గానికి 100 బెడ్ రూమ్ లు ఇవ్వలేదు అదే కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇల్లను అందిస్తుంది. తొమ్మిది రోజుల్లో 9000 కోట్ల రైతు భరోసా అందించామన్నారు.
ఇప్పటివరకు 27 వేల కోట్ల రూపాయలు రైతు రుణ మాఫీ చేసాం అని అన్నారు. పేదలకు సన్న బియ్యం, 200 యూనిట్లు ఉచిత కరెంటు 500 కే గ్యాస్ సిలిండర్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించి ప్రజాపాలన అందిస్తున్నామన్నారు.