20-11-2025 12:00:00 AM
మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్
మంథని, నవంబర్ 19(విజయ క్రాంతి) రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రైతులకు భరోసానిచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ అన్నారు. మంథని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో బుధవారం మండలంలోని మల్లారం, వెంకటాపూర్, నాగెపల్లి, భట్టుపల్లి వరి ధాన్యం కేంద్రాలను ఏఎంసి చైర్మన్ కుడుదుల వెంకన్న, ఆరెంద, స్వర్ణపల్లి, అడవిసోమన్ పల్లి, చిల్లపల్లి, మల్లేపల్లి, పోతారం, సిరిపురం కేంద్రాలను సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ నాయకులు, రైతులు, హమలిలతో కలిసి ప్రారoభించారు.
ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ రైతు పండించిన ప్రతీ గింజను కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని, రైతుకు మద్దతు ధరతో పాటు క్విoటాల్ కు రూ.500 బోనస్ ప్రభుత్వం ద్వారా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమవుతుందని అన్నారు. ఏఎంసి చైర్మన్ కుడుదుల వెంకన్న మాట్లాడుతూ గత ప్రభుత్వం తాలు, తప్ప పేరిట వరి ధాన్యంలో కోత విధించేదని, కాంగ్రెస్ ప్రభుత్వం లో ఒక్క గింజ కూడా కటింగ్ లేకుండా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమాల్లో సంఘ డైరెక్టర్లు ఆకుల రాజబాపు, పెద్దిరాజు ప్రభాకర్, రావికంటి సతీష్ కుమార్, సిరిముర్తి ఓదెలు, లెక్కల కిషన్ రెడ్డి,కొత్త శ్రీనివాస్, దాసరి లక్ష్మి-మొండయ్య, దేవల్ల విజయ్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రు రమాదేవి, మాజీ ఎంపిపి కొండ శంకర్,
ఏఎంసి మాజీ చైర్మన్ ఆకుల కిరణ్, నాయకులు బూడిద శంకర్, ఊట్ల అనిల్, ఎరుకల ప్రవీణ్, అక్కపాక సంపత్, బిబ్బర కిషన్, తాళ్ల సత్యనారాయణ, గుమ్మడి రాజయ్య, రాజేంద్ర ప్రసాద్ తిరుపతి రెడ్డి, వెంకటస్వామి, సంఘ కార్యదర్శి మామిడాల అశోక్ కుమార్, నాయకులు, కార్యకర్తలు, రైతులు, హమాలీలు, మహిళలు, ఐకెపి అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.