calender_icon.png 19 November, 2025 | 2:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే

19-11-2025 12:00:00 AM

బీసీ పొలిటికల్ ఫ్రెంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్

ముషీరాబాద్, నవంబర్ 18 (విజయక్రాం తి): తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీసీ సమాజానికి ప్రభుత్వం బహిరంగ క్షమాపణ చెప్పాలని బీసీ పొలిటికల్ ప్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజ్ గౌడ్ స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం చిక్కడపల్లిలోని పొలిటికల్ ప్రంట్ రాష్ట్ర కార్యాలయంలో కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్, యెలికట్టే విజయకుమార్ గౌడ్, అంబాల నారాయణ గౌడ్ తో కలిసి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ పరంగా 42 రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలకు వెళ్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఇది బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని అన్నారు. 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలకు పోతామని చెప్పి ఉత్తుత్తి జీవోలు ఇచ్చి బీసీలను మోసం చేస్తున్నారని విమర్శించారు.

ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడం అంటే బీసీలను అధికారానికి దూరం చేయడమే అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజా ప్రతినిధులందరూ రాజీనామా చేసి బయటికి రావాలని, డిసెంబర్ 1 నుంచి 9 వరకు జరిగే ప్రజాపాలన వారోత్సవ సంబరాలను అడుగడుగున అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బైరు శేఖర్ గంగపుత్ర, దామోదర్ పాల్గొన్నారు.