22-11-2025 01:03:18 AM
అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటించిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రం శుక్రవారం విడుదలైంది. వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించిన ఈ సినిమాకు సాయిలు కంపాటి దర్శకత్వం వహించారు. ప్రేక్షకాదరణ పొందుతున్న నేపథ్యంలో ఈ మూవీటీమ్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ బన్నీ వాస్ మాట్లాడుతూ.. “ఊరి నుంచి వచ్చిన డైరెక్టర్ సాయిలు తనలోని నిజాయితీ, ఆ ఫ్యూరిటీతో సినిమా రూపొందించాడు.
ఈ సినిమాలో హీరోయిన్‌ను తండ్రి కొట్టే సీన్‌ను చూసి కొందరు బాధపడ్డారు. నేనూ బాధపడ్డా. అయితే ఆ తండ్రి కూతురుని దండించడంలోనూ ప్రేమే ఉంది. సినిమా కంటెంట్‌ను జడ్జ్ చేయడంలో మేమంతా మరోసారి సక్సెస్ అయ్యాం” అన్నారు. హీరో అఖిల్‌రాజ్ మాట్లాడుతూ.. “థియేటర్లలో ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తుండటం చూసి నేను ఇన్నేళ్లు కోరుకున్నది, చూడాలనుకు న్నది ఇదే అనిపించింది” అని చెప్పారు.
హీరోయిన్ తేజస్విని మాట్లాడుతూ.. “మా స్నేహితురాలు ఫోన్ చేసి ఈ సినిమా చూశాక ఆనందంతో కన్నీళ్లు వచ్చాయని చెప్పింది. ఇలా ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన మా సినిమా విజయానికి నిదర్శనం” అని తెలిపారు. డైరెక్టర్ సాయిలు మాట్లాడుతూ.. “అమీర్‌పేట చౌరస్తాలో బ్యాండ్ కొట్టి సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకుంటా” అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి, సంగీత దర్శకుడు సురేశ్ బొబ్బిలి, చిత్రబృందం పాల్గొన్నారు.