calender_icon.png 26 May, 2025 | 4:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇలా నిర్మించారు.. అలా కూలిపోయింది

26-05-2025 12:42:07 AM

-  నిర్మాణంలో నాణ్యత ఉందా? లేదా?

- పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారుల నిర్లక్ష్యం 

- ఇదేం నిర్మాణం అంటున్న గ్రామస్తులు 

మహబూబ్‌నగర్, మే 25 (విజయక్రాం తి): ప్రభుత్వ నిధులతో నిర్మాణాలు ఎక్కడ జరిగిన అధికారులు ప్రత్యేకంగా తనిఖీలు చేపడుతూ నాణ్యతగా నిర్మించేందుకు ప్రత్యే క యంత్రంగా ఉంటుంది. కాగా సాయం త్రం ఇప్పుడు పాలమూరులో సరిగ్గా పనిచేయడం లేదని నిజాలకు ఎన్నో సాక్షాలు నిలువెత్తుగా నిలబడుతున్నాయి.

ఇటీవల డ్రైనేజీ కూలిన సంఘటన మరువక ముందే మహబూబ్ నగర్ రూరల్ మండ లం జమిస్తాపూర్ గ్రామంలో ఎస్సీ సబ్ ప్లా న్ కింద రూ 20 లక్షలతో  గాజులపేట పెద్ద నరసింహులు ఇంటి నుండి  లింగం మైబు ఇంటి వరకు 10 రోజు ల క్రితం నూతనంగా ని ర్మించిన మరొక డ్రైనేజీ కాలువ రాత్రి పడిన చి న్నపాటి వర్షానికి కూలిపోయింది.

కారణము ఇనుము వాడ కుండా కేవలము డస్ట్, కంకర, సి మెంటు మాత్రమే వాడడం వల్ల  కూలిపోవడం జరిగింది. తక్కువ డబ్బులతో నిర్మించి అధిక లాభాలు గడించాలని ఈ రకంగా నాసిరకం వాడి కట్టడం జరిగిందని,ఇందులో అధికారులు కాంట్రాక్టర్ తో కుమ్మక్కై నిర్మాణం నాసిరకంగా చేశారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇ ప్పుడున్న డ్రైనేజీని పూర్తిగా తీసివేసి ఇను ము, ఇసుక, కంకర, సిమెంట్ తో పటిష్టంగా నిర్మించాలని, ఇలాంటి నాసిరకం ముడి సరుకులతో నిర్మించిన కాంట్రాక్టర్ లైసెన్స్ రద్దు చేయాలని గ్రా మస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే నూతనంగా బా ధ్యతలు చేపట్టినాయి తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. తీసుకున్న చర్యలు తదితర విషయా లు తెలియాల్సి ఉంది.