calender_icon.png 26 May, 2025 | 7:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐసీడీఎస్ అవినీతిపై రెవెన్యూ శాఖ విచారణ?

26-05-2025 12:28:09 AM

‘విజయక్రాంతి’ కథనానికి అక్రమార్కుల్లో గుబులు 

భద్రాద్రి కొత్తగూడెం మే 25 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐసిడిఎస్ టేకులపల్లి ప్రాజెక్టులో అధికారులపై వ చ్చిన అవినీతి అక్రమాలపై మాతృ సంస్థతో కాకుండా, రెవెన్యూ శాఖతో విచారణ నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్టు విశ్వాసనీ యంగా తెలిసింది. ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికా రి గతంలో ఉద్యోగం పేరుతో వసూళ్లకు పా ల్పడ, ప్రస్తుతం కమిషన్ల పేరుతో రూ లక్షలు వసూలు చేసినట్టు ఆరోపణలు వెలబడుతున్నాయి.

వచ్చిన ఆరోపణలపై గతంలో మా తృ సంస్థ అయిన ఐసిడిఎస్ అధికారులు  న మాత్రంగా విచారణ నిర్వహించి అక్రమార్కులను రక్షించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కమీషన్ల పేరుతో రూ 7.98 లక్షలు వసూలు చేసినట్టు వచ్చిన ఫి ర్యాదు పై రెవెన్యూ శాఖ విచారణ నిర్వహిం చ నున్నట్లు తెలుస్తోంది. కనీసం రెవెన్యూ శా ఖ విచారణలో నైన అవినీతి, అక్రమాలు వె లుగు చూసి  తమకు న్యాయం జరిగేనా అం టూ బాధితులు ఎదురుచూస్తున్నారు.

అవినీతి అధికారులపై సుమోటో విచారణ 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం ఐసిడిఎస్ ప్రాజెక్టులో అంగన్వాడీ టీచర్లు, ఆయాల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడిన టేకులపల్లి సిడిపిఓ, సూపర్వైజర్లపై సుమోటో విచారణ నిర్వహించాలని, విధుల నుంచి తొలగించాలని అంగనవాడి టీచర్లు ,ఆయాల అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నరాటి ప్రసాద్ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో డిమాండ్ చేశారు.  

 నరాటి ప్రసాద్, అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు