15-07-2025 12:44:21 AM
బొగ్గు రవాణాను పెంచాలి : సిపిఐ
మణుగూరు, జూలై 14 ( విజయ క్రాంతి) : ఏరియాలో లారీల ద్వారాబొగ్గు రవాణాను పెంచాలని, లారీయజమాను లను సంస్థ ఆదుకోవాలని, మండల, పట్టణ సిపిఐ కార్యదర్శులు జక్కుల రాజబాబు , దుర్గ్యాల సుధాకర్, లారీ ఓనర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు మిడిదొడ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.
సోమవారం పార్టీ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడారు.లారీలు బాడీబండ్ల కు లోడింగ్ ను పెంచాలని, బొగ్గు క్వాలిటీ లేక పర్మిట్లు వెనక్కి వెళ్ళి పోతున్నాయన్నారు. ఏరియాలో1500 మందికి పైగా 20 ఏళ్లుగా బొగ్గు లోడింగ్ ఫై ఆధారపడి జీవిస్తున్నారన్నారు.
సింగరేణి వివిధ పరిశ్రమలకు రైల్వే వ్యాగన్ల ద్వారా బొగ్గు ర వాణా చేస్తుండడంతో లారీలకు ఆర్డర్లు తగ్గి లారీ ఓనర్ల తో పాటు డ్రైవర్లు, క్లీనర్ల జీవితాలు అతలాకుతలం ఆయ్యాయయని, లారీలకు ఈఎంఐలు కూడా కట్టలేని పరిస్థితి వచ్చిందన్నారు. ఇ ప్పటికై నా సింగరేణి యాజమాన్యం లారీలకు ఆర్డర్లు ఇచ్చి లారీఓనర్లను ఆదుకోవాలని కోరారు.
ఈ సమావేశం లో లారీఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సత్యనారాయణ , కార్యదర్శి మేరెడ్డి సురేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శి ఆడప స్వా మి ,లోడింగ్ ఇంచార్జ్ తూపూ డి గోవిందు ,కోశాధికారి పెన్నపు రెడ్డి జయపాల్ రెడ్డి, సహాయ కార్య దర్శి కుమ్మరకుంట్ల వెంకట సోము లు, ఆర్గనైజింగ్ కార్యదర్శి జుమ్మారి వెంకన్న, బాబు, భానోత్ భాస్కర్, ఎం శ్రీనివాస్, ఎండి గౌస్, ఉప్పలయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.