calender_icon.png 25 May, 2025 | 6:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చరిత్రలో నేడు

25-05-2025 12:00:00 AM

ఇంటర్నేషనల్ మిస్సింగ్ చిల్డ్రన్స్ డే

అంతర్జాతీయ తప్పిపోయిన పిల్లల దినోత్సవం ప్రతి సంవత్సరం మే 25న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. తప్పిపోయిన పిల్లలు, అపహరణకు గురైన పిల్లల గురించి ప్రజల్లో అవగాహన పెంచడం కోసం ఈ దినోత్సవం జరుపుకుంటారు. 2001 నుంచి ఆరు ఖండాల్లోని 20కి పైగా దేశాల్లో ఈ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు.

సబర్మతి ఆశ్రమ స్థాపన

సబర్మతి ఆశ్రమాన్ని మహాత్మా గాంధీ 1917 మే 25న అహ్మదాబాద్‌లో సబర్మతి నది ఒడ్డున స్థాపించారు. గాంధీజీ స్నేహితుడు జీవన్‌లాల్ దేశాయ్ కొచ్రాబ్ బంగ్లాలో ఈ ఆశ్రమం ఉన్నది. గాంధీజీ తన జీవితకాలంలో ఎక్కువ సమయంలో ఈ ఆశ్రమంలోనే గడిపారు. అక్కడే భారతదేశ స్వాతంత్య్ర పోరాటం.. దండి మార్చ్, సహాయ నిరాకరణ ఉద్యమం వంటి గొప్ప ఉద్యమాలకు ఇది కేంద్రం. 

వరల్డ్ థైరాయిడ్ డే

ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం ప్రతి సంవత్సరం మే 25న జరుపుకుంటారు. ఇది థైరాయిడ్ సంబంధిత వ్యాధులను గురించి అవగాహన పెంచడం, ఆ వ్యాధులతో బాధపడే వారి కోసం సపోర్ట్ అందించడం లక్ష్యంగా ఉంది. థైరాయిడ్ గ్రంథి మెడలో ఉన్న ఒక ముఖ్యమైన గ్రంథి. ఇది శరీరంలో జీవక్రియ, పెరుగుదల, అభివృద్ధిని నియంత్రిస్తుంది.