22-12-2025 01:38:34 AM
వాజేడు డిసెంబర్ 21(విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ సీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. వాజేడు మండలం, చింతూరు గ్రామంలో వైయస్ జగన్ అభిమానులు కేక్ కట్ చేశారు.ఒకరికొకరు కేక్ తినిపించుకొని, జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.పిల్లలకు స్వీట్లు, చాక్లెట్లు పంచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తండ్రి ఆశయాలు ముందుకు తీసుకువెళ్లేందుకే జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు 5సంవ త్సరాలు కాలంలో అనేక పథకాలు ప్రవేశపెట్టి మేలు చేకూర్చారని కొనియాడారు. జగన్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పిలక శ్రీనివాసరెడ్డి, మాధవరెడ్డి, కాగితాల దుర్గారెడ్డి, మోహన్ రెడ్డి, జీరి రేవంత్ రెడ్డి, అనంతరెడ్డి, తోట మల్లయ్య, కన్నెబోయిన సమ్మయ్య, విగేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు