calender_icon.png 28 May, 2025 | 9:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు కృషి చేయాలి

05-04-2025 04:58:11 PM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్...

కామారెడ్డి (విజయక్రాంతి): బాబూ జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా శనివారం  మున్సిపల్ కార్యాలయ ఆవరణలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... నలభై సంవత్సరాలు పార్లమెంట్రియన్ గా పది సంవత్సరాలు క్యాబినెట్ మంత్రిగా జగ్జీవన్ రాం పనిచేశారని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు రాజీవ్ యువ వికాసం కింద అర్హులైన వారు యూనిట్ల స్థాపనకు ఈ నెల 14 లోగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్ర కాంత్ రెడ్డి మాట్లాడుతూ... బాబూ జగ్జీవన్ రాం ఎంపీగా, ఉప ప్రధానిగా పనిచేశారన్నారు.

జిల్లాలో శాఖ గ్రంథాలయాలు పనిచేస్తున్నాయని, యువత సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అంతకుముందు పలువురు పలు సంఘాల ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చందర్ నాయక్, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారిణి రజిత, ఆర్డీవో మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి టిపిఓ గిరిధర్ అంబేద్కర్ సంఘ అధ్యక్షుడు గంగారాం ఎమ్మార్పీస్ జిల్లా అధ్యక్షుడు భూమయ్య మాదిగ వివిధ సంఘం నాయకులు కొత్తపల్లి మల్లన్న, సిద్ధిరాములు, శ్రీనివాస్, బాబు బాబయ్య, నర్సింలు, శివరాం సాయిలు కార్యకర్తలు పాల్గొన్నారు.