28-05-2025 08:03:42 PM
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు..
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): యోగ మాస ఉత్సవాలలో ప్రతి ఒక్కరు పాలుపంచుకొని విజయవంతం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) పిలుపునిచ్చారు. 11వ అంతర్జాతీయ యోగ మాస ఉత్సవాల సందర్భంగా ఆయుష్మాన్ ఆరోగ్య 11వ అంతర్జాతీయ యోగ మాస ఉత్సవాల సందర్భంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఆయుష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్ను బుధవారం చిట్యాలలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్, డైరీ డెవలప్మెంట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్,ఆయుష్ హోమియో డిస్పెన్సరీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ త య్యబా కౌసర్, పి.హెచ్.సి డాక్టర్ ఈసం వెంకటేశ్వర్లు, సిహెచ్ఓ నరసింహారావు, ఫార్మసిస్ట్ సరిత, పిఎసిఎస్ చైర్మన్ సుంకరి మల్లేష్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ చిన్న వెంకటరెడ్డి, యోగ ఇన్స్ట్రక్టర్లు కే బజరంగ్ ప్రసాద్, వైష్ణవి, ఆశా వర్కర్లు జయమ్మ సైదమ్మ శైలజ గీత రజిత కవిత తదితరులు పాల్గొన్నారు.