calender_icon.png 2 May, 2025 | 8:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా శ్రీ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

05-04-2025 05:00:45 PM

బాబు జగ్జీవన్ రామ్ నేటి తరానికి జీవితం ఆదర్శం..

పెద్ద కొడప్గల్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శనివారం ఘనంగా శ్రీ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ... కుల రహిత సమాజం కోసం పాటుపడిన మహనీయుడు సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం క్షేమం కోసం అలుపెరుగని కృషిచేసిన సంఘ సంస్కర్త స్వతంత్ర సమరయోధులు వెనుకబడిన వర్గాల నుంచి వచ్చారు అతను బాబుజీగా ప్రసిద్ధుడు భారతదేశానికి గొప్ప సేవలు అందించిన ప్రజా నాయకులు అని జీవితంలో నేటి తరానికి ఆదర్శప్రాయుడని కొనియాడారు. శ్రీ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ మండల సీనియర్ నాయకులు పి నాగిరెడ్డి, డాక్టర్ సంజీవ్, బసవరాజ్ దేశాయ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.