calender_icon.png 22 August, 2025 | 5:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుతిన్‌తో జైశంకర్ భేటీ

22-08-2025 01:50:37 AM

రష్యా పర్యటనలో ఉన్న జైశంకర్

న్యూఢిల్లీ, ఆగస్టు 21: మూడు రోజుల పర్యటన నిమిత్తం రష్యాకు వెళ్లిన భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ గురువారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అయ్యారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామని భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 50 శాతం సుంకాలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధా న్యత సంతరించుకుంది. సమావేశం అనంతరం జైశంకర్ మీడియాతో మాట్లాడారు.

‘ఉక్రెయిన్‌తో ఇటీవలి పరిణామాలను పుతి న్ పంచుకున్నారు. రాష్ట్రపతి, ప్రధాని అభినందనలను పుతిన్‌కు తెలియజేశా. వార్షిక ద్వైపాక్షిక చర్చలకు కావాల్సిన ఏర్పాట్లు జరుగుతున్నాయి’ అని తెలిపారు. ఉదయం ర ష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్‌తో జైశంకర్ భేటీ అయ్యారు. పుతిన్, సెర్గీ లవ్రోవ్‌తో భేటీకి సంబంధించి జైశంకర్ సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు.