27-01-2025 05:21:20 PM
భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డు(Jasprit Bumrah wins ICC Test Cricketer of the Year award) వరించింది. బుమ్రా 2024 ఏడాదికిగాను టెస్టు క్రికెట్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచాడు. గతేడాది టెస్టుల్లో అద్భుత బౌలింగ్ బుమ్రా ఆకట్టుకున్నాడు. 13 మ్యాచుల్లో 71 వికెట్లు తీసిన భారత పేసర్ గా చరిత్ర సృష్టించాడు. టీ 20 ఫార్మాట్ లోనూ టీమిండియా ప్లేయర్ ను ఐసీసీ అవార్డు వరించింది. 2024 ఐసీసీ టీ 20 క్రికెట్ ఆఫ్ ది ఇయర్ గా అర్ష్ దీప్ సింగ్(Arshdeep Singh named ICC Men's T20I Cricketer of the Year 2024) నిలిచాడు. 2024 ఐసీసీ మహిళల వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును స్మృతి మంధాన(Smriti Mandhana) గెలుచుకుంది.
భారత టెస్ట్ వైస్ కెప్టెన్(India Test Vice Captain) 14.92 సగటుతో 71 వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే. 2024లో టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ప్రతిష్టాత్మకమైన గౌరవాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ పేసర్‌గా నిలిచాడు. 2024 సంవత్సరానికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (International Cricket Council) పురుషుల టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ నిలిచినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని బుమ్రా ఐసిసికి ఒక వీడియో ప్రకటనలో తెలిపారు. "ఈ ఫార్మాట్ ఎల్లప్పుడూ నా హృదయానికి దగ్గరగా ఉంటుంది. నేను ఎల్లప్పుడూ ఈ ఫార్మాట్‌లో ఆడాలని కోరుకుంటున్నాను. కాబట్టి, నిజంగా సంతోషంగా ఉంది ఐసిసి నుండి ఈ గౌరవం పొందడానికి." అని బుమ్రా పేర్కొన్నాడు.