24-11-2025 12:26:48 AM
కొండపాక, నవంబర్ 23:శ్రీ సత్య సాయి బాబా శతజయంతోత్సవం సందర్భంగా కుకునూరుపల్లి మండల కేంద్రంలో ఆదివారం సత్య సాయి భజన మండలి ఘనంగా నిర్వహించారు. సత్య సాయి భజన మండలి లో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు.
శ్రీ సత్య సాయి బాబా ప్రజలకు చేసిన సేవలను, ప్ర జలకు సత్యసాయి ట్రస్ట్ ల నుంచి అందించిన సేవలు ప్రజల మనసులో ఎప్పటికీ చిరస్థాయి గా ఉంటాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వంటేరు ప్రతాపరెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, కిరణ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్ తదితరులుపాల్గొన్నారు.