24-11-2025 12:25:34 AM
కొండాపూర్, నవంబర్ 23 : కొండాపూర్ మండల పరిధిలోని సైదాపూర్ తండాలో ఎస్టీ కమ్యూనిటీ భవనానికి ఆదివారం టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, సొసైటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుదాస్, ప్రశాంత్ గౌడ్, తాజా మాజీ సర్పంచ్ ఆరుణ వంశీధర్ గౌడ్, హాజీ పటేల్, మంగళారం ప్రవీణ్ కుమార్, తలారి రాజు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అశోక్, సునీల్, ఆత్మ కమిటీ డైరెక్టర్ రాజు, రఘురాం రెడ్డి, పార్టీ కార్యకర్తలు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.