27-01-2025 12:00:00 AM
వరుసగా రెండో ఏడాది కైవసం
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్-2025 పురుషుల విభాగంలో జానిక్ సిన్నర్ (ఇటలీ) విజేతగా నిలిచాడు. అలెగ్జాండర్ జ్వె రెవ్ (జర్మనీ)తో జరిగిన ఫైనల్లో 6-3, 7-6 (7-4), 6-3 తేడాతో విజయం సాధించి వరుసగా రెండో ఏడాది కూడా ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను కైవసం చేసుకున్నాడు.
తొలి సెట్‌ను సునాయాసంగానే చేజిక్కించుకున్న సిన్నర్ రెండో సెట్లో విజయం కోసం చెమటోడ్చాల్సి వచ్చింది. ఈ సెట్ టై బ్రేకర్‌కు దా రి తీసి.. ఉత్కంఠకు గురి చేసింది. అయినా కానీ సిన్నర్‌కే సెట్ కైవసం అయింది. ఇక మూడో సెట్‌లో కూడా సిన్నర్ పై చేయి సా ధించి వరుసగా రెండో ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను కైవసం చేసుకున్న ఆటగాడిగా రికార్డులకెక్కాడు.
2 గంటల 42 నిమిషాల పాటు సాగిన పోరులో సిన్నర్ రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసినా కానీ ఆ ప్రభావం ఫలితం మీద పడకుండా జాగ్రత్త పడ్డాడు.