24-07-2025 12:48:27 AM
లోతట్టు ప్రాంతాలను పర్యటించిన మాజీ డిప్యూటీ మేయర్
జవహర్ నగర్ , జూలై 23 (విజయక్రాంతి):జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లోతట్టు ప్రాంతాలను బుధవారం మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ సందర్శిం చారు. పాపయ్య నగర్తో కాలనీతో పాటు పలు కాలనీలను సందర్శించారు. భారీ వర్షాల కారణంగా జలమయమైన కాలనీల్లో ప్రజల ఇబ్బందులను పరిశీలించారు.ఈ సందర్భంగా రెడ్డిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జేసీబీ సహాయంతో నీటిని బయటికి పంపే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
జవహర్నగర్ మున్సిపాలిటీలో నిధుల కొరత కారణంగా ఈ లోతట్టు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం కల్పించలేకపోతు న్నామనీ, తాత్కాలిక మరమ్మత్తులతో కొంతవరకు ప్రజలకు ఇబ్బందును పరిష్కరిస్తున్నామని తెలిపారు. త్వరలోనే ఇక్కడి ప్రాంతాల ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కాం చూపుతామని హామీ ఇచ్చారు.పాపయ్య నగర్ కాలనీ ప్రజలతో పాటు పలు కాలనీల ప్రజలకు అండగా నిలుస్తూ, స్థానిక సమస్యలను పరిష్కరిస్తుండటంతో కాలనీవాసులుహర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన అం దిస్తున్న సహాయానికి స్థానికులు కృతజ్ఞతలుతెలిపారు.