24-07-2025 12:46:17 AM
-చిట్‌చాట్‌లో సీఎం రేవంత్
హైదరాబాద్, జూలై 23 (విజయక్రాంతి): ఫోన్ టాపింగ్ ద్వారా ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ కూడా విన్నారని అంటున్నారని... సొంత కుటుంబ సభ్యుల ఫోన్‌లే టాపింగ్ చేసి వినాల్సిన పరిస్థితి వస్తే అంతకంటే సూసైడ్ చేసుకోవడం ఉత్తమమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం ఢిల్లీలో ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఫోన్ టాపింగ్ అంశంపై రేవంత్ మాట్లాడారు. ఫోన్ టాపింగ్ ఇల్లీగల్ కాదని... కానీ లీగల్‌గా పర్మిషన్ తీసుకుని చేయాల్సి ఉంటుందన్నారు.
బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తన ఫోన్ టాప్ అవుతున్నదని మొదట ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాడని సీఎం గుర్తుచేశారు. తన ఫోన్ టాపింగ్ కాలేదని భావిస్తున్నానని... ఒకవేళ టాపింగ్ అయి ఉంటే తనను కూడా విచారణకు పిలిచే వారని అన్నారు. ప్రస్తుతం ఫోన్ టాపింగ్‌పై విచారణ జరుగుతుందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కోసం ఏర్పాటు చేసిన సిట్‌ను డిక్టేట్ చేయబోనని తెలిపారు. సెంట్రల్ యూనివర్సిటీ భూములను తాకట్టు పెట్టలేదని సీఎం స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ కవిత పంచాయతీ వారి ఆస్తులు, అధికారానికి సంబంధించినదని అన్నారు.