24-07-2025 12:48:27 AM
రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి
భీమదేవరపల్లి, జూలై 23: స్థానిక సంస్థల ఎన్నికలలో గ్రామ గ్రామాన బిజెపి జెండా ఎగురవేయడమే లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి అన్నారు హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండల అధ్యక్షులు శ్రీరామోజు శ్రీనివాస్ అధ్యక్షతన మండల సంస్థగత ఎన్నికల మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామ్ గోపాల్ రెడ్డి అసెంబ్లీ కన్వీనర్ గుర్రాల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో వార్డు మెంబర్, సర్పంచ్ ఎంపీటీసీ జడ్పిటిసి స్థాయి వరకు గెలిచే అవకాశం ఉంది అని అన్నారు. అదేవిధంగా మన ఈ మండలానికి కేంద్ర సహాయ మంత్రి వర్యులు మన పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ 60 లక్షలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించి నారని అన్నారు.
అదేవిధంగా పార్లమెంట్ నియోజకవర్గం లో ప్రభుత్వ పాఠశాల పిల్లలకు 20000 వేల సైకిల్ ను కూడా పంచడం జరిగిందన్నారు. భీమదేవరపల్లి మండలం ని అభివృద్ధి పథంలోకి తీసుకురావడానికి ముందున్నారని తెలియజేస్తూ అత్యధిక సంఖ్యలో స్థానిక సంస్థలలో గెలుపులు ఉండాలని అన్నారు. గత టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏమి చేయలేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గుడ్డిగా నమ్మినందుకు ప్రజలు విసుగుచెంది ఉన్నారు.
కావున భారతీయ జనతా పార్టీ మన దేశానికి వెన్నుముకగా నిలిచింది కాబట్టి ప్రజలు బిజెపి పార్టీ వైపు గ్రామ స్థాయి నుండి నిలుస్తున్నారు. వాటి ఈసారి స్థానిక సంస్థలలో కచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా అన్ని స్థానిక సంస్థల్లో జెండా ఎగరవేస్తుందని నమ్మకం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా చాలా సంవత్సరాల కాలం నుండి భారతీయ జనతా పార్టీ నాయకులు నక్సల్స్ కు ఎదురోడ్డి కష్టనష్టాలకి, చావులకి ఎదురు నిల్చొని పార్టీని నిలబెట్టిన మన సీనియర్ నాయకులకి ఘనంగా సన్మానించి రాబోయే కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలలో వారి సేవలు కొనసాగాలని మండల నాయకులకి వారి యొక్క ఆశీస్సులు ఉండాలని వారిని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ పైడిపల్లి పృథ్వీరాజ్, సీనియర్ నాయకులు దొంగల కొమరయ్య , బలిజ భద్రయ్య, మారుపాటి అశోక్ రెడ్డి,పెద్ది సూర్యప్రకాష్, అటుకాల కనకయ్య, దుర్గా సింగ్,, చిదురాల రమేష్, పోలినేని సుధాకర్ రావు, గుండెల్ని సదానందం,గండు సదానందం,జిల్లా కార్యదర్శి మాచర్ల కుమారస్వామి, మహిళా నాయకురాలు అంబీర్ కవిత తదితరులు పాల్గొన్నారు.