calender_icon.png 3 November, 2025 | 6:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుంతలపై స్పందించిన జేసీబీ ఓనర్.. ప్రజల ప్రశంసలు

03-11-2025 12:26:18 AM

అశ్వాపురం, నవంబర్ 2 (విజయక్రాంతి):మొండికుంట సెంటర్ ప్రధాన రహదారిపై ఏర్పడిన పెద్ద పెద్ద గుంతలు వాహనదారులకు ప్రమాదాలుగా మారడంతో, ఆ పరిస్థితిని చూడలేక ఒక యువకుడు ముందుకు వచ్చాడు. మొండికుంటకు చెందిన జెసిబి యజమాని పంపణ మధు, స్వచ్ఛందంగా తన ట్రాక్టర్లతో మట్టిని తీసుకువచ్చి, జెసిబి సహాయంతో రహదారిపై ఉన్న గుంతలను పూడ్చారు.

ఆర్ అండ్ బి శాఖ చేయాల్సిన పనిని సామాజిక బాధ్యతతో స్వయంగా నిర్వర్తించిన ఆయన తీరును స్థానికులు అభినందిస్తున్నారు. ప్రజలు మాట్లాడుతూ, ప్రభుత్వ శాఖలు నిర్లక్ష్యం చేసిన పనిని సాధారణ పౌరుడు తన ఖర్చుతో చేయడం ప్రశంసనీయం. ఇ లాంటి వ్యక్తులు సమాజానికి ఆదర్శంఅనిఅన్నారు.