calender_icon.png 4 November, 2025 | 1:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులైన వారికి సొంతింటి కలను సహకారం చేస్తాం

03-11-2025 06:40:54 PM

ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు

మహాత్మా జ్యోతిబాపూలే బీసీ వెల్ఫేర్ పాఠశాలను ఆకస్మిక తనిఖీ

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంత ఇంటి కలను సాకారం చేయడానికి సిద్ధంగా ఉందని కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. సోమవారం లింగంపేట మండలం మోతే గ్రామంలో నియోజకవర్గంలోనే మొట్టమొదటి ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులు జ్యోతి శివయ్య దంపతులకు కొత్త పట్టు వస్త్రాలు అందజేసి తన ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇళ్లు వాస్తవరూపం దాలుస్తున్నాయని అందుకు నిదర్శనం మొదటి ఇందిరమ్మ ఇల్లును ప్రారంభించడమేనని అన్నారు.

గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కూడా పూర్తి అవ్వలేదని, కనీసం నిర్మాణం చేసే పరిస్థితి కూడా ఉండేది కాదని అన్నారు. తన నియోజకవర్గంలోనే ఏకంగా 3500 ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడం కాంగ్రెస్ ప్రభుత్వానికి పేద ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలవకముందు ప్రజలకు పేదింటి కలను సాకారం చేస్తానని ఇచ్చిన హామీని ఇప్పుడు నిలబెట్టుకుంటున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లను త్వరతగతిన పూర్తి చేయడంలో కృషి చేసిన అదికారులను అభినందించారు. లింగంపేట మండలంలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ వెల్ఫేర్ పాఠశాలను ఆకస్మికంగా పరిశీలించారు. పర్యటన సందర్భంగా విద్యార్థులతో స్వయంగా మాట్లాడి, వారికి అందజేస్తున్న అన్నం నాణ్యత తక్కువగా ఉందని విద్యార్థులు తెలిపినప్పుడు, ఎమ్మెల్యే  తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

వెంటనే రైస్ సరఫరాదారులతో మాట్లాడి, తక్షణమే మంచి నాణ్యత గల బియ్యం సరఫరా చేయాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎమ్మెల్యే టీచర్ల హాజరు రిజిస్టర్‌ను పరిశీలించగా, ఒకరు స్కూల్‌లో లేరని, ఎంఈఓ కార్యాలయానికి స్కూల్ పనుల నిమిత్తం వెళ్లారని తెలిసింది. దీనిపై ఎమ్మెల్యే స్వయంగా,మండల విద్యా అధికారి,తో, చరవాణిలో, మాట్లాడి తెలుసుకున్నారు. అనంతరం టీచర్లకు సూచిస్తూ, “పాఠశాల సమయాల్లో విద్యార్థులతోనే గడపాలి, ఇతర పనుల కోసం స్కూల్ సమయాన్ని వాడకూడదు” అని అన్నారు. ఎమ్మెల్యే మదన్ మోహన్  మాట్లాడుతూ, తాను త్వరలో మళ్లీ పాఠశాలను సందర్శిస్తానని, అప్పటికి విద్యార్థుల నుండి ఎలాంటి ఫిర్యాదులు వినకూడదని హెచ్చరించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో విద్యారంగ అభివృద్ధికి, విద్యార్థుల సంక్షేమానికి ఎమ్మెల్యే మదన్ మోహన్  నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ, లింగంపేట మండల అధ్యక్షుడు నారా గౌడ్, మాజీ జెడ్పిటిసి శ్రీలత సంతోష్ రెడ్డి, ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జొన్నలగడ్డ రాజు రఫీయోద్దీన్ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.