21-12-2025 01:04:39 AM
న్యూఢిల్లీ, డిసెంబర్ ౨౦: ‘నరేగా’ స్థానం లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘వీబీ జీ రామ్ జీ’ చట్టం నల్లచట్టమేనని ఏఐసీసీ అగ్ర నాయకురాలు- సోనియాగాంధీ మండిపడ్డారు. గ్రామీణ ప్రాంతంలో నిరుపేదలకు ఉపాధి కల్పించే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేందుకే, పాత చట్టాన్ని రద్దు చేసిందని నిప్పులుచెరిగారు. శనివారం ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఓ వీడియా సందేశం విడుదల చేశారు.
కొత్తచట్టం చేయడమంటే నిరుపేదలపై ప్రత్యక్షంగా దాడి చేయడమేనని ఆమె అభిప్రా యపడ్డారు. ఇది కూడా ‘బుల్డోజర్’ రాజకీయాల లాంటిదేనని అభివర్ణించారు. రైతు లు, కార్మికులు, భూమిలేని కూలీల ప్రయోజనాలు, హక్కులను కాలరాసేందుకే నల్లచ ట్టాలు రూపొందిస్తున్నదని మండిపడ్డారు. ఉపాధి పథకాన్ని బలహీనపరిచేందుకు మో దీ ప్రభుత్వం దశాబ్ద కాలంగా ప్రయత్నాలు చేస్తోందని, దీనిలో భాగంగానే తాజాగా పే రు మార్చిందని ఆరోపించారు. 20 ఏళ్ల క్రి తం నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఉపాధి హామీ పథకానికి శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు.
పార్లమెంట్‌లో ఆ బిల్లు ఏకాభిప్రా యంతో ఆమోదం పొందిందని గుర్తుచేసుకున్నారు. నాడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకు న్న విప్లవాత్మకమైన నిర్ణయాల్లో ఉపాధి పథకం గొప్పదని కొనియాడారు. పథకం అ మలుతో గ్రామాల్లో వలసలు ఆగిపోయాయని, గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు పథకం ఎంతో ఉపకరించిందని పేర్కొన్నారు. అంతటిఘనత ఉన్న పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ఎలాంటి చర్చ లేకుండా, ఎవర్నీ సంప్రదించకుండా చట్టం తీసుకురావడం దారుణమన్నారు.
విపక్షాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా చట్టాన్ని మార్చివేయ డం అప్రజాస్వామికమన్నారు. ‘కొత్త చట్టం ప్రకారం పని ఎవరికి ఇవ్వాలి.. ఎక్కడ ఇవ్వా లి అనే నిర్ణయాలు ఇకపై ఢిల్లీలోని ప్రభు త్వం తీసుకుంటుంది.
దీనివల్ల క్షేత్రస్థాయి వా స్తవాలకు సంబంధం ఉండదు’ అని తెలిపా రు. నిధుల కేటాయింపులో రాష్ట్రాలపై భారాన్ని పెంచారని వాపోయారు. గ తంలో కూలీల వేతనాల మొత్తాన్ని కేంద్రమే భరించేదని, ఇప్పుడు రాష్ట్రాలు 40 శాతం భరిం చాల్సి రావడం వల్ల పేద రాష్ట్రాలపై ఒత్తిడి పెరుగుతుందని వెల్లడించారు. కొవిడ్ సమయంలో ఉపాధి హామీ పథకం పేదలకు ఆర్థికంగా అండగా నిలచిందని గుర్తుచేశారు.