calender_icon.png 14 July, 2025 | 1:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాన్స్ జెండర్లకు ఉపాధి అవకాశం

13-07-2025 04:42:21 PM

పునరావాస పథకం కింద దరఖాస్తుల స్వీకరణ..

జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్..

మంచిర్యాల (విజయక్రాంతి): జిల్లాలోని నిరుద్యోగులైన ట్రాన్స్ జెండర్లకు ఉపాధి పునరావాస పథకం అమలు చేయడం జరుగుతుందని జిల్లా మహిళా, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్(Welfare Department Officer Rauf Khan) ఆదివారం తెలిపారు. ఇందుకోసం అర్హులైన ట్రాన్స్ జెండర్ ల నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణలో భాగంగా డ్రైవింగ్, ఫొటో, వీడియోగ్రఫీ, బ్యూటీషియన్, జ్యూట్ బ్యాగ్ తయారీ, టైలరింగ్, లాజిస్టిక్ రంగాలలో శిక్షణ ఇస్తున్నామన్నారు. ఆసక్తి, అర్హత గల ట్రాన్స్ జెండర్లు www.wdsc.telangana.gov.in వెబ్ సైట్ లో ఈ నెల 23 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 040-24559050 లో సంప్రదించాలన్నారు.