06-12-2025 12:27:27 AM
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ టౌన్, డిసెంబర్ 5: భూమికి విలువ తగ్గదని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పాలక సంస్థ పరిధిలోని ఎదిర, ఐటి పార్క్ సమీపంలో శ్రీ రామచంద్ర కాలనీలో నూతన రియల్ ఎస్టేట్ వెంచర్ ను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం వెంచర్కు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ భూమికి ఎప్పుడూ విలువ ఉంటుందని.
సరైన ప్రదేశంలో, సక్రమ పద్ధతుల్లో అభివృద్ధి చేసిన భూమి పెట్టుబడులు తరతరాలకు ఉపయోగపడే ఆస్తులని, మహబూబ్ నగర్ ప్రస్తుతం రాష్ట్రంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న నగరాల్లో ఒకటి. రాబోయే రోజుల్లో ఐటి పార్క్ విస్తరణ, రింగ్ రోడ్, హెల్త్ సిటీ, నేషనల్ హైవే విస్తరణ వంటి ప్రాజెక్టులతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతున్నదని ” అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోంది. రోడ్లు, డ్రైనేజ్, విద్యుత్, తాగునీటి సదుపాయాలు, ఐటి రంగ ప్రోత్సాహం, ఇవన్నీ మహబూబ్ నగర్ భవిష్యత్తు విలువను రెట్టింపు చేసే అంశాలు. ప్రజలకు నాణ్యమైన నివాస ప్రాంతాలను అందించడం ప్రభుత్వ లక్ష్యం అని ఆయన చెప్పారు.
ఈ వెంచర్ కూడా అదే దిశగా ఒక ముందడుగు అని పేర్కొన్నారు. గత రెండు సంవత్సరాల నుంచి మహబూబ్ నగర్ నగరం రూపం మారిందన్నారు. అన్ని రంగాల్లో మహబూబ్ నగర్ అభివృద్ధి లో పరుగులు పెడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, నాయకులు శాంతన్న యాదవ్, శ్రీనివాస్ యాదవ్, శివశంకర్ చర్ల శ్రీనివాసులు, గ్యాస్ అంజి, శ్రీశైలం, అల్లి తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.