calender_icon.png 23 November, 2025 | 1:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీవో 46ను రద్దు చేయాలి

23-11-2025 12:47:38 AM

  1. కాంగ్రెస్, బీజేపీల మోస ఫలితమే జీవో
  2. నేడు జీవో 46 ప్రతుల దహనం
  3. బీసీ జేఏసీ చైర్మన్ జాజుల

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 22 (విజయక్రాంతి): రాష్ట్రంలో త్వరలో జరగ బోయే సర్పంచ్ ఎన్నికలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పరిమితి 50 శాతం మించకూడ దని రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 46 విడుదల చేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నా మని, దాన్ని రద్దు చేయాలని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ ప్రకటనలో కోరారు. కాంగ్రెస్, బీజేపీల మోసం ఫలితమే జీవో46 అని ఆగ్రహం వ్యక్తంచేశారు.

రాష్ట్రం లో 60 శాతం ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్లు అమలుచేస్తామని ప్రభుత్వం జీవో 9ని గతంలో చేసిందని, ఇప్పుడు ఆ జీవోను రద్దుచేసి 46 జీవో తీసుకొచ్చి బీసీల రాజకీయ అణచివేతకు పాల్పడుతోందని  అన్నారు. జాతీయ పార్టీలు పార్లమెంట్‌లో బీసీ బిల్లును ఆమోదించడానికి ప్రయత్నం చేసి ఉంటే రాజ్యాంగ సవరణ ద్వారా ౪౨శాతం రిజర్వేషన్లు అమలు జరిగే అవకా శం ఉండేదన్నారు.

కానీ ఏమీ ప్రయత్నించ కుండా రిజర్వేషన్ల విషయంలో రెండు పార్టీలు కలిసి బీసీలను బలిపశువు చేశాయ ని ఆయన ఆరోపించారు. జీవో 46ను రద్దు చేయాలని, జీవో 9 మాత్రమే అమలు చేయాలి డిమాండ్‌చేశారు. జీవో 46 ప్రతుల ను ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా దహనం చేయాలని పిలుపునిచ్చారు.