23-11-2025 01:10:13 AM
మేడ్చల్, నవంబర్ 2 2(విజయక్రాంతి): జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా తోటకూర వజ్రేస్ యాదవ్ నియమితులయ్యారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ శనివారం రాత్రి రాష్ట్రంలోని వివిధ జిల్లా అధ్యక్షులు ప్రకటించారు. బిసి వర్గానికి చెందిన వజ్రేష్ యాదవ్ కు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్ష పదవి దక్కింది. జిల్లా అధ్యక్ష పదవిని పలువురు ఆశించగా అనూ హ్యంగా వజ్రష్ యాదవ్ కు వరించింది. హరి వర్ధన్ రెడ్డి, బిసి వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్, నక్క ప్రభాకర్ గౌడ్ అధ్యక్ష పదవిని ఆశించారు.
హరి వర్ధన్ రెడ్డి బిసి వర్గం నుంచి శ్రీశైలం గౌడ్ కు పదవి దక్కుతుందని భావించారు. వజ్రెష్ యాదవ్ ప్రస్తుతం మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్నారు. రేవంత్ రెడ్డి అనుచరుడిగా పేరుపొందారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చ ల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వజ్రష్ యాదవ్ రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ లో చేరారు. బిసి వర్గానికి చెందిన నాయకుడే కాకుండా, ఐదేళ్లుగా పార్టీలో ఉన్నందున ఈయనకు పదవి వరించిందని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. ఏఐసీసీ విధించిన నిబంధనలతో హరి వర్ధన్ రెడ్డి, శ్రీశైలం గౌడ్ లకు అవకాశం దక్కలేదని భావిస్తున్నారు.