14-10-2025 12:28:39 AM
సిడ్నీ,అక్టోబర్ 13: ప్రతిష్టాత్మక యాషెస్ సి రీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు బిగ్‌షాక్ తగిలిం ది. కెప్టెన్ ప్యాట్ కమ్మి న్స్ యాషెస్ సిరీస్ తొలి టెస్టుకు దూరం కానున్నాడు. వెన్నునొప్పితో బాధపడుతున్న ఈ ఆసీస్ సారథి తొలి టెస్ట్ సమయానికి కోలుకోవడం కష్టమేనని తెలుస్తోంది. ఈ విషయాన్ని కమ్మిన్సే స్వయంగా వెల్లడించాడు. ప్రస్తుతం తన రికవరీ స్లోగా ఉందని, బౌలిం గ్ ప్రాక్టీస్ వచ్చే వారం నుంచి మొదలుపెడతానని చెప్పాడు.
అయితే టర్ఫ్ వికెట్‌పై ప్రా క్టీస్ చేసినా పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేందుకు మరికొన్ని వారాలు పడుతుందని చె ప్పుకొచ్చాడు. వెన్నునొప్పి కారణంగానే గత కొంతకాలంగా ఆటకు దూరమైన కమ్మిన్స్ భారత్‌తో జరిగే సిరీస్‌కు సైతం అందుబాటు లో లేడు. కాగా కమ్మిన్స్ దూరమైతే యాషెస్ సిరీస్‌లో స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియాకు సారథ్యం వహించే అవకాశాలున్నాయి.