14-10-2025 12:30:58 AM
కోహ్లీ, రోహిత్‌లపై రవిశాస్త్రి అంచనా
న్యూఢిల్లీ, అక్టోబర్ : భారత స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్‌కు రెడీ అవుతున్నారు. టీ20, టెస్ట్ ఫార్మాట్లకు గుడ్ బై చెప్పిన వీరిద్దరూ వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. 2027 వన్డే ప్రపంచకప్ ఆడా లని టార్గెట్‌గా పెట్టుకున్నారు. అయితే కోచ్ గంభీర్ యువఆటగాళ్ళకే ఎక్కువ అవకాశాలిస్తున్న నేపథ్యంలో ప్రపంచకప్ జట్టులో రోకో ద్వయానికి చోటు దక్కుతుందా అన్న చర్చ జరుగుతోంది.
తాజాగా టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి దీనిపై స్పందించాడు. రోహిత్, కోహ్లీ ఖచ్చితంగా వరల్డ్ కప్ ప్లాన్స్ లో ఉంటారన్నాడు. అయితే అప్పటి వరకూ తమ ఫామ్, ఫిట్‌నెస్ ఎలా కొనసాగిస్తారన్న దానిపైనే వారి అవకాశాలు ఆధారపడి ఉం టాయని అభ్రిప్రాయపడ్డాడు. రానున్న ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ వీరిద్దరికీ చాలా కీలక మని వ్యాఖ్యానించాడు.
దీనిలో సత్తా చాటితే వరల్డ్‌కప్ జట్టులో ఆశలు పెట్టుకోవచ్చని, ఒ కవేళ ఫెయిలైతే మాత్రం మరో అవకాశం దక్కుతుందన్నది చెప్పలేమన్నాడు. కోహ్లీ, రో హిత్‌కు కూడా ఈ సిరీస్‌తో తమ ఫ్యూచర్‌పై క్లారిటీ వస్తుందని కూడా చెప్పుకొచ్చాడు. ఇక చాలు అనుకుంటే మాత్రం ఆసీస్ సిరీస్ చివరిది కావొచ్చని అభిప్రాయపడ్డాడు.