calender_icon.png 22 November, 2025 | 12:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్ద చెరువును రక్షించండి

22-11-2025 12:35:10 AM

ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్‌కు ఇబ్రహీంబాగ్‌వాసుల వినతి 

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 21 (విజయక్రాంతి): కాలుష్యం కోరల్లోకి కూరుకుపోతున్న ఇబ్రహీంబాగ్‌లోని పెద్ద చెరువు ను రక్షించి, ఇక్కడి ప్రజల జీవితాలను కాపాడాలని ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్‌ను స్థానికులు కోరారు. 70 ఎకరాల విస్తీర్ణం కలిగిన పెద్ద చెరువు తీవ్రమైన కాలుష్యానికి గుర వుతున్న నేపథ్యంలో స్థానికులు ఎమ్మెల్సీని శుక్రవారం కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. మణికొండ, పూపల్గూడ, అల్కాపూర్, ఓయూ కాలనీ ప్రాంతాల నుంచి నియంత్రణలేని మురుగునీటి ప్రవాహం చెరువును దెబ్బతీస్తోందని వారు తెలిపారు.

చెరువు జీవవైవిధ్యం నాశనం అవుతోందని, దుర్వాసన, అపరిశుభ్రవాతావరణం స్థానికుల ఆ రోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నారు. తక్షణమే మురుగునీటి ప్రవాహం చెరువులోకి చేరకుండా నిలిపివేయడంతో పాటు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు, చెరువు శుభ్రపరిచే పనులు చేపట్టాలని ఎమ్మెల్సీని కోరారు. చెరువు పూర్తిగా నాశనం కాకముం దే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పెరి క సురేష్, వెంగల్ రెడ్డి, దయానంద్ పటేల్, శ్రీరాంరెడ్డి, భీంరెడ్డి, రాకేష్ పటేల్, వెంకట్, శ్రీనివాస్ కళ్యాణ్, డేవిడ్, రాంగోపాల్, దీప్తి, సౌభాగ్య తదితరులు పాల్గొన్నారు.