calender_icon.png 22 November, 2025 | 12:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిసెంబర్ 14న ప్రతిభా ప్రోత్సాహక పరీక్ష

22-11-2025 12:20:47 AM

50కి పైగా కేంద్రాల్లో ‘మెగా రెసోఫాస్ట్’ 

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 21 (విజయక్రాంతి): రెసోనెన్స్ జూనియర్ కళాశాలలు, పాఠశాలలతో కూడిన రెసోనెన్స్ గ్రూప్ హైదరాబాద్‌లో డిసెంబర్ 14వ తేదీన అతిపెద్ద ప్రతిభా ప్రోత్సాహక పరీక్ష మెగా రెసోఫాస్ట్ నిర్వహించనుంది. ఇందుకు సంబంధించి శుక్రవారం నిర్వహించిన వేడుకకు మాజీ జేడీ లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరై, మెగా రెసోఫాస్ట్‌కు ఆయన చేతుల మీదుగా శ్రీకారం చుట్టారు.

ఈ ప్రతిభా పరీక్ష నగరంలోని 50కి పైగా కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఐదు నుంచి పదకొండో తరగతి విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులు. ఈ పరీక్ష లక్ష్యం విద్యార్థుల ప్రతిభను గుర్తించడం, వారి బలాన్ని పెంపొందించడం, విద్యా, పోటీ పరీక్షల్లో విజయానికి దారి చూపడం. ఈ పరీక్షలో అత్యుత్తమంగా నిలిచిన విద్యార్థులకు ఉచిత విద్య అందించబడుతోంది. రూ.100 కోట్ల విలువైన స్కాలర్షిప్స్, టాప్ ర్యాంకర్లకు 100 ట్యాబ్‌లు ఇవ్వనున్నారు.

ఈ సందర్భంగా జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. విద్య అనేది ప్రగతిశీల సమాజానికి వెన్నెముక అన్నారు. ఈ పరీక్షను నిజంగా ప్రభావవంతంగా చేసేది ఏమిటంటే, విద్యార్థులు తమ స్థానం ఏమి టో తెలుసుకోవడానికి, బలాలను గుర్తించడానికి, ప్రారంభ దశలోనే విద్యా పునాదులను బలోపేతం చేయడానికి ఇది ఒక అవకాశాన్ని ఇస్తుందన్నారు. రెసోనెన్స్ మేనేజిం గ్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు, ఆయన బృం దం దార్శనికతను అభినందించారు.

ఈ సందర్భంగా రెసోనెన్స్ ఎడ్యుకేష నల్ ఇన్స్టిట్యూషన్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మేనేజిం గ్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ.. సమగ్ర అకడమిక్ వ్యవస్థ, విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతుల ద్వారా ప్రతిభను వికసింపచేయడం మా లక్ష్యమన్నారు. ఈ ప్రతిభా పరీక్ష మా నిబద్ధతకు నిదర్శనమన్నారు. హైదరాబాద్లోని ప్రతి విద్యార్థిని చేరుకోవడం, ప్రతిభను గుర్తించడం తమ ధ్యేయమన్నారు. మరింత సమాచారానికి 9959154371, 9963980259 నంబర్లలో సంప్రదించవచ్చునని కోరారు.