calender_icon.png 21 October, 2025 | 12:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శింబు సామ్రాజ్యం

19-10-2025 12:28:18 AM

శింబు కథానాయకుడిగా వెట్రిమారన్ దర్శకత్వంలో వీ క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ తమిళ నిర్మాత కలైపులి ఎస్ థాను ఓ సినిమా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయింది. త్వరలో రెండో షెడ్యూల్ ప్రారంభించనున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించారు మేకర్స్. తమిళంలో ‘అరసన్’, తెలుగులో ‘సామ్రాజ్యం’ అనే టైటిల్స్‌ను ఖరారు చేశారు.

టైటిల్ అనౌన్స్‌మెంట్ తెలుగు ప్రోమోను స్టార్ హీరో ఎన్టీఆర్ చేతుల మీదుగా సోషల్ మీడియాలో విడుదల చేయించారు. ఈ ఐదున్నర నిమిషాల నిడివి గల ఈ వీడియోలో విజువల్స్ ప్రారంభానికి ముందు వచ్చే అనిరుధ్ నేపథ్య సంగీతం ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. మేకర్స్ ఈ సినిమాను తెలుగులో సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్ రవిచందర్; కెమెరా: వేల్ రాజ్, స్టంట్స్: పీటర్ హెయిన్; ఎడిటర్: కే రామర్; ఆర్ట్: జాకీ.