16-07-2025 12:31:45 AM
చేగుంట, జులై 15 : విద్యుత్ షాక్ తగిలి ఆర్డీవో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఉద్యోగి మృతి చెందిన ఘటన చేగుంట మండలం ఇబ్రహీంపూర్లో మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన మారిపల్లి శ్రీనివాస్ (38) తన సొంత వ్యవసాయ పొలం వద్ద వరి నాట్లు వేస్తుండగా బోరు మోటర్ నడవకపోవడంతో స్టాటర్ రిపేర్ చేస్తుండగా అకస్మాత్తుగా కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు,
విషయం తెలుసుకున్న చేగుంట ఎస్త్స్ర శ్రీ చైతన్య కుమార్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి పంచనామా నిర్వహించారు. మారిపల్లి శ్రీనివాస్ ప్రస్తుతం తూప్రాన్ ఆర్డిఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నాడు. శ్రీనివాస్ మరణంతో గ్రామంలో విషాదఛాయలునెలకొన్నాయి.