24-07-2025 12:00:00 AM
విద్యార్థి సంఘాల డిమాండ్
జహీరాబాద్, జూలై 23 : జహీరాబాద్ పట్టణంలోని జూనియర్ కాలేజీలో నెల కొన్న సమస్యలను ప్రభుత్వం, అధికారులు పరిష్కరించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. బుధవారం జహీరాబాద్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఆర్డీవో కార్యాలయం ముందు సమస్యలు పరిష్కరించాలంటూ ధర్నా చేపట్టారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చాలీచాలని ఇరుగు గదులలో విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని, వారికి సరిపడా తరగతి గదులను నిర్మించాలని డిమాండ్ చేశారు.
జూనియర్ కళాశాలలో దాదాపు 800 పైగా అడ్మిషన్స్ ఉన్నప్పటికీ సరిపడా గదులు లేక పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. కళాశాలకు సరైన ప్రహరీ గోడ లేకపోవడంతో కళాశాల నుండి ఇతర వ్యక్తులు రాకపోకలు సాగిస్తున్నారని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ డివైఎఫ్‌ఐ విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు.