calender_icon.png 9 January, 2026 | 6:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యతోనే సమాజాభివృద్ధి

06-01-2026 12:00:00 AM

సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు ఆకుల భద్రప్ప 

కొండపాక,జనవరి 5: ప్రతి వ్యక్తి విద్యావంతుడు అవుతేనే సమాజము గ్రామాలు అభివృద్ధి చెందుతాయని కుకునూరుపల్లి మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు ఆకుల భద్రప్ప అన్నారు. కుకునూరుపల్లి మండలం తిప్పారం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఎంఈఓ బచ్చలి సత్తయ్య పాఠశాల ఉపాధ్యాయ బృందం సహకారంతో స్పోరట్స్ డ్రెస్ ల పంపిణీ కార్యక్రమం, నూతన సర్పంచ్ పంచాయతీ నూతన పాలకవర్గ సభ్యులకు పాఠశాల ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమంతో పాటు  నిర్వహించారు.

ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో భద్రప్ప మాట్లాడుతూ విద్యార్థులు చక్కగా చదువుకొని గ్రామానికి తల్లిదండ్రులకు గురువులకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని సూచించారు. పాఠశాలలో ఎలాంటి సమస్యలు ఉన్న తీర్చడానికి తమ పాలకవర్గం కృతనిశ్చయంతో పనిచేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ బచ్చలి సత్తయ్య, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రమేష్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సిహెచ్ రవి, ఏఐపిసి చైర్ పర్సన్ రేణుక తదితరులు మాట్లాడారు.

ఈ సందర్భంగా పాలకవర్గాన్ని ఎంఈఓ సత్తయ్య పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు హెచ్ రవి ఉపాధ్యాయ బృందం రామకృష్ణారెడ్డి,మాధురి శాలువాలతో సత్కరించారు. పంచాయతీ కార్యదర్శి మమత, వార్డు సభ్యులు కనకరాజు, భారతమ్మ, రాజమణి , రాజు, సురేష్ గౌడ్, బాబు చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.