అధికారుల ఒత్తిడితో ప్రమాదానికి గురైన జూనియర్ లైన్‌మన్
- సబ్ స్టేషన్ ఎదుట విద్యుత్ కార్మికుల నిరసన
- ఏఈ అఖిల్, ఏడీ హక్‌లను వెంటనే సస్పెండ్ చేయాలి
సికింద్రాబాద్, జూలై 2 (విజయక్రాంతి): తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ బోయిన్ పల్లి చిన్న తోకట్ట ఇండోర్ సబ్ స్టేషన్ ఏరియా పరిధిలో పనిచేస్తున్న కిష్టాపురం మోహన్ (25)అనే జూనియర్ లైన్ మెన్ విద్యుత్ ప్రమాదానికి గురై తీవ్ర గాయాల పాలయ్యాడు.ఓల్ బోయిన్ పల్లి సమత నగర్ లోని పివి ఎంక్లేవ్ సత్య సాయి ఫీడర్ వద్ద బుధవారం సాయంత్రం ట్రాన్స్ ఫారం మీద విద్యుత్ మరమ్మతుల పనుల చూస్తున్నప్పుడు నిచ్చాన మీద నుంచి కరెంటు షాక్ తగిలి ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ ప్రమాదంలో జెఎల్‌ఎం 50నుం డి 60శాతం తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.అతని పరిస్థి తి ప్రమాదకరంగా ఉందని తోటి కార్మికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. జెఎల్‌ఎం విద్యుత్ ప్రమాదానికి గురి కావడం సంబంధిత అధికారులు ధోరణి కారణమేనని కార్మికులు ఆరోపిస్తున్నారు. కార్మికుల పట్ల అధికారులు పని ఒత్తిడి తీవ్రంగా పెంచుతు ఇబ్బందుల గురిచేస్తున్నారని ఆరోపించారు.
సబ్ స్టేషన్ ఎదుట విద్యుత్ కార్మికుల నిరసన..
చిన్న తోకట్ట సబ్ స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న జూనియర్ లైన్ మ్యాన్ ప్రమాదానికి గురికావడానికి సంబంధించిన శాఖ ఏఈ , ఎడి ల నిర్లక్ష్య ధోరణే కారణమంటు సబ్ స్టేషన్ ఎదుట గురువారం కార్మికులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు కార్మిక సంఘాల నాయకులు సామ్యూల్ జాన్, ప్రసాద్, ప్రభాకర్ మాట్లాడుతూ ఓల్ బోయినపల్లి డివిజన్‌లోని వి ద్యుత్ శాఖ అధికారులు ఏఈ అఖిల్, ఏడీ హక్ లను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. జెఎల్‌ఎం లను మానసిక వేదనకు గురిచేసి పని ఒత్తిడి పెంచుతు అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారని ఆరోపించారు.8గంటల పని దినాన్ని 12గంటలు చేయిస్తున్నారని ఆరోపించారు.
ఒక జూనియర్ లైన్మెన్‌తో పాటు ఒక ఆర్టిజన్ ను కూడా ఏర్పాటు చేయాల్సిన అధికారులు అలా చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఒక జూనియర్ లైన్మెన్ ప్రమాదబారిన పడితే సంబంధిత ఏడి,ఏఈ లు కనీసం బాధిత కార్మికుడిని పరామర్శించిన పాపాన పోలేదని అన్నారు.
పని ఒత్తిడి పెంచుతూ 8గంటలను 12గంటలు చేయిస్తు ఇబ్బందులు గురి చేస్తున్నారని అన్నారు. తమకు కలుగుతున్న ఇబ్బందులను పై అధికారులకు తెలియజేసేందుకు తాము నిరసన కార్యక్రమాలు చేపడుతుంటే తమ పట్ల కక్ష ధోరణిగా వ్యవహరించే ప్రమాదం ఉన్నందున వారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో అరుణ్, మద్దిలేటి,కిరణ్,నర్సింహా యాదవ్, ప్రసాద్ రాజు,శ్రీనివాస్ యాదవ్,లైన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఏఈ అఖిల్ వివరణ..
జూనియర్ లైన్ మే న్ మోహన్ ప్రమాదబారిన పడిన వెంటనే 108 అంబులెన్స్‌లో ఆ సుపత్రికి తరలించి మె రుగైన వైద్య చికిత్స చేస్తున్నట్టు ఏఈ అఖిల్ తెలియజేశారు.






