calender_icon.png 12 July, 2025 | 7:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తండ్రీకొడుకుల భావోద్వేగాలతో ‘జూనియర్’

12-07-2025 12:14:10 AM

‘జూనియర్’ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌లోకి అరంగేట్రం చేస్తున్నాడు కిరీటి రెడ్డి. ఈ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ కు రాధాక్రిష్ణ దర్శకత్వం వహించారు. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మించారు. ఈ సినిమా జూలై 18న రిలీజ్ కానుండటంతో టీమ్ ప్రమోషన్స్ దూకుడు పెంచింది. ఇందులో భాగంగా శుక్రవారం దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు.

దర్శకుడు రాధాక్రిష్ణ ఈ సినిమాలో యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్, రొమాన్స్, మంచి ఎమోషన్స్ అన్నీ అద్భుతంగా బ్లెండ్ చేశారు. ఫాదర్-సన్ ఎమోషనల్ ట్రాక్, జెనీలియా పాత్ర, ఊరి బ్యాక్‌డ్రాప్ ఇవన్నీ కలిపి ఈ సినిమాను ఒక మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్‌కి నచ్చే కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా నిలబెట్టాయి.