calender_icon.png 12 July, 2025 | 6:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సార్ మేడమ్ 25న వస్తున్నారు!

12-07-2025 12:15:17 AM

విజయ్ సేతుపతి, నిత్యా మేనన్ జంటగా ఓ రోమ్ కామ్ ఫ్యామిలీ డ్రామా రూపొందింది. పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలిమ్స్ బ్యానర్ పై సెందిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ మూవీ టైటిల్ టీజర్ ను శుక్రవారం విడుదల చేశారు. ‘సార్ మేడమ్’ అనేది ఈ సినిమా టైటిల్ కాగా ‘ఎ రగ్గ్ డ్ లవ్ స్టోరీ’ అనేది దీనికి ట్యాగ్ లైన్ అని వెల్లడించారు.

ఈ టైటిల్ టీజర్.. పెళ్లికి ముందు ఓ అమ్మాయికి మెట్టినింటి వాళ్లు చెప్పే మాటలతో మొదలై, భార్యాభర్తల మధ్య జరిగే ఫన్నీ గొడవతో ఆకట్టుకుంది. విజయ్ సేతుపతి, నిత్యా మేనన్ మధ్య సాగే సంభాషణలు ప్రేక్షకుల్ని అలరించాయి. టీజర్ ప్రారంభంలో వంట మాస్టర్‌లా కనిపించిన విజయ్ సేతుపతి చివర్లో గన్ పట్టుకొని మాస్ యాక్షన్ లుక్ కనిపించడం చాలా ఆసక్తికరంగా వుంది.

ఈ చిత్రంలో యోగిబాబు, ఆర్ కే సురేష్, చెంబన్ వినోద్ జోస్, శర్వణన్, దీప ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నెల 25న థియేటర్లో విడుదల కానున్న ఈ చిత్రానికి డీవోపీ: ఎం సుకుమార్, ఎడిటర్: ప్రదీప్ ఇ రాఘవ్, ఆర్ట్: వీర సమర్.