calender_icon.png 5 July, 2025 | 5:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడే లబ్ధిదారుడికి న్యాయం : కలెక్టర్

05-07-2025 12:40:02 AM

కామారెడ్డి, జూలై 4 (విజయ క్రాంతి): భూభారతి సమస్యల పరిష్కారం కోసం రెవిన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడే లబ్ధిదారుడికి న్యాయం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆరేపల్లి, తలమడ్ల, గ్రామాలలో భూభారతి సర్వే పనులను పరిశీలించారు. క్షేత్రస్థాయికి వెళ్లి రైతులను భూభారతి గురించి అడిగి తెలుసుకున్నారు.

సమస్యలు పరిష్కారమవుతున్నాయని రైతులు తెలిపారు. తలమడ్లలో జడ్పిహెచ్‌ఎస్ పదవ తరగతిలో విద్యార్థులతో గణిత సమస్యలు పరిష్కరించేందుకు సూచనలు చేశారు. ప్రైమరీ పాఠశాలను సందర్శించారు విద్యార్థులకు యూనిఫామ్ ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. కమ్యూనిటీ స్పెషల్ రెస్పాన్సిబిలిటీ కింద సికింద్రాబాద్ రోటరీ క్లబ్ 3 రీడింగ్ టేబుల్స్ విద్యార్థులకు అందజేశారు.

ప్రైమరీ పాఠశాల విద్యార్థుల మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు. కిచెన్ షెడ్ సరిగా లేకపోవడంతో రూ.50 వేలు రూపాయలు మంజూరు చేశారు. పాఠశాల పరిసరాలను పరిశీలించి ఎప్పటికప్పుడు జతను తొలగిస్తూ శుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఆర్డీవో వీణ, ఎంపీడీవో రఘురాం, పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ,తాసిల్దార్ జానకి, మండల విద్యాశాఖ అధికారి పూర్ణచందర్, ప్రధానోపాధ్యాయులు బిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.