08-08-2025 12:00:00 AM
అంతర్గత దర్యాప్తును సవాల్ చేసిన పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, ఆగస్టు 7: ఇంట్లో నోట్ల కట్టలు బయటపడిన కేసులో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వర్మ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. నోట్ల కట్టల వ్యవహారంపై ఇప్పటికే అంతర్గత దర్యాప్తు చేసి.. ఆయన్ను న్యాయమూర్తిగా తొలగించాలని సిఫారసు చేశారు. ఇదే నివేదికను వర్మ తాజాగా సుప్రీం కోర్టులో సవాల్ చేయగా.. అత్యున్నత న్యాయస్థానం ఆ పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో పార్లమెంట్‌లో వర్మపై అభిశంసన చేపట్టేందుకు మార్గం సుగుమం అయింది.
జస్టిస్ వర్మ పిటిషన్‌పై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఏజీ మాషితో కూడిన ధర్మాసనం వాదనలు విని.. పిటిషన్‌ను సమర్థించలేమని తేల్చిచెప్పింది. ఈ ఏడు మార్చిలో జస్టిస్ యశ్వంత్ వర్మ ఢిల్లీ నివాసంలో అగ్నిప్రమాదం జరగ్గా.. ఈ ఘటనలో భారీ మొత్తంలో కాలిన నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు ముగ్గురు న్యాయమూర్తులతో విచారణ కమిటీని నియమించగా.. ఆ కమిటీ వర్మను పదవి నుంచి తొలగించాలని నివేదిక సమర్పించింది.