calender_icon.png 9 August, 2025 | 6:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజీపడే ప్రసక్తే లేదు

08-08-2025 12:00:00 AM

  1. రైతుల కోసం ఏమైనా చేసేందుకు భారత్ సిద్ధం
  2. ట్రంప్ టారిఫ్‌లపై పరోక్షంగా స్పందించిన ప్రధాని మోదీ
  3. భారత్‌పై ఇప్పటికే 50 శాతం సుంకాలు విధించిన ట్రంప్

న్యూఢిల్లీ, ఆగస్టు 7: అమెరికా అధ్యక్షుడు భారత్‌పై 50 శాతం ప్రతీకార సుంకాలు విధించారు. ఈ సుంకాల పెంపుపై భారత ప్రధాని నరేంద్రమోదీ గురువారం పరోక్షంగా స్పందించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ భారతీయ రైతుల ప్రయోజనాలను ఫణంగా పెట్టమని అమెరికాకు గట్టిగా బదులిచ్చారు. భారత్ రష్యా నుంచి ముడిచమురు, ఆయుధాలు దిగుమతి చేసుకుంటోందని ఆరోపిస్తూ ట్రంప్ ఈ సుంకాలు విధించారు.

వ్యవసాయ శాస్త్రవేత్త, హరిత విప్లవ పితామహుడు ఎం.ఎస్ స్వామినాథన్ జయంతిని పురస్కరించుకుని న్యూఢిల్లీలో జరిగిన ‘ఎం.ఎస్ స్వామినాథన్ సెంటినరీ అంతర్జాతీయ సదస్సు’లో ప్రసంగించారు. ఈ సదస్సులో అమెరికా సుంకాలపై మోదీ స్పందించారు. ‘రైతుల సంక్షేమమే మాకు ముఖ్యం. రైతులు, మత్య్సకారులు, పాడి రైతుల ప్రయోజనాల విషయంలో భారత్ ఎప్పటికీ రాజీపడదు. ఈ నిర్ణయం వల్ల వ్యక్తిగతంగా ఎంతో చెల్లించాలని నాకు తెలుసు.

రైతుల కోసం ఎంతైనా చెల్లించేందుకు సిద్ధమే. భారత్ కూడా అందుకు సిద్ధంగా ఉంది’ అని మోదీ పేర్కొన్నారు. అమెరికా ప్రతీకార సుంకాల విషయంలో ఇన్ని రోజులు మాట్లాడకుండా ఉన్న ప్రధాని రైతుల ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. భారత్ తమకు మిత్రదేశం అని చెబుతూనే ట్రంప్ 50 శాతం సుంకాలు విధించారు. ఈ ప్రతీకార సుంకాలపై విదేశాంగ శాఖ కూడా ఘాటుగా స్పందించింది. తాజాగా విధించిన 50 శాతం సుంకాలు ఆగస్టు 27 నుంచి అమలు చేస్తామని ట్రంప్ ప్రకటించారు.